ఘ‌నంగా వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు.. 

సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు తెలుగు రాష్ట్రాల‌తో పాటు వివిధ దేశాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఏపీలో పార్టీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో విస్తృతంగా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో పుట్టిన రోజు వేడుక‌లు అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి భారీ కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంతరం అక్కడ రక్తదాన శిబిరం, సేవా కార్యాక్రమాలు నిర్వహించారు.  బర్త్‌ డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్‌కు విషెస్‌ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు.  

Back to Top