తూర్పుగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజంగా ప్యాకేజీ స్లారే అని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పవన్ ప్యాకేజీ తీసుకోకపోతే గుమ్మడి కాయల దొంగలుగా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే పవన్ బస్సు యాత్ర వాయిదా వేసుకున్నారు. విశాఖ గర్జన రోజే జనవాణి ఎందుకు పెట్టారు?. పవన్ వ్యాఖ్యలు తాను రీప్లే చేసి చూసుకుంటే తనకే అసహ్యం వేస్తుంది. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన పవన్ కల్యాణ్‌కు మతి ఉందా?. జనసేన నేతలు మహిళలను ఓట్లు అడగగలారా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు లాంటి ఔట్‌డేటెడ్ నేత కోసం ఎందుకు ఆరాటం అని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.