దేవాలయాల సంక్షేమంపై సీఎం వైయస్ జగన్ దృష్టిపెట్టారు
మంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి: దేవాలయాల సంక్షేమంపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిపెట్టారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధిపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను ఆదాయంగానే చూసింది..చంద్రబాబు ఏనాడూ దేవాలయాలను పట్టించుకోలేదన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. అర్చకులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అన్నారు. ధూపదీపనైవేద్యాల స్కీమ్‌కు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల స్కీమ్ కోసం బడ్జెట్ కేటాయించామని తెలిపారు. దేవాలయ వ్యవస్థను పారదర్శకంగా నడుపుతున్నామన్నారు. ఇంకా కొన్ని దేవాలయాలను ధూపదీప నైవేద్యాల స్కీమ్ చేర్చాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. అర్చకులకు ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమని మల్లాది విష్ణు పేర్కొన్నారు.