చిత్తూరు: మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. రేపు కూడా అధికారంలోకి రాబోతున్నాం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతిలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కలిసిమెలిసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాలి.. కావున అందరూ కష్టపడి పనిచేయాలి.. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు అంతా విజయం సాధించేలా పనిచేయాలని కోరారు.. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, మళ్లీ ఓటు అడిగే విధంగా సీఎం వైయస్ జగన్ చేశారు. ఇప్పుడు అభ్యర్థులు ఖారారయ్యారు కాబట్టి.. అందరినీ కలుపుకొని నేతలు ముందుకు పోవాలని సూచించారు.. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరలా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.. ఈ బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.