చిత్తూరు: ప్రతిపక్ష పార్టీలు గుంపులుగా వచ్చినా.. విడివిడిగా వచ్చినా 2024లో గెలిచేది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. వైయస్ జగనే మళ్లీ సీఎం రాసిపెట్టుకోండి అంటూ మంత్రి ఆర్కే రోజా ధీమా వ్యక్తం చేశారు. గురువారం మంత్రి రోజా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. నాకు ఆరోగ్యం బాగలేదని కొంతమంది సంతోషపడుతున్నారట.. డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరో రోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో అతనికే తెలియదు.. ప్రజల ఎమి చేస్తావో చెప్పకుండా వైయస్ జగన్, వైయస్ఆర్ సీపీ నేతలపై చీప్‌గామాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజకీయాల్లో వచ్చింది సేవ చేయడానికా? లేక అధికార పార్టీ నేతలను కొట్టడానికా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. అమ్మవారి పేరు వాహనానికి పెట్టుకుని బూతుపురాణం చేబుతున్నాడు.. ప్రజలు దృష్టిలో పవన్ విలన్‌గా మారుతున్నాడని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.. ఇప్పటికైన చిరంజీవి చెప్పిన మాట పవన్ వింటే మంచిదని రోజా హితవు పలికారు.