న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌తి ఇంట్లో ఆనందం

ఏ.నారాయణపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్య‌క్ర‌మం

ఇంటింటా సంక్షేమ పథకాల లబ్ధిని వివరించిన ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి

అనంతపురం  :   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌తో ప్రతి ఇంటిలో ఆనందం వెల్లువిరుస్తోంద‌ని ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి అన్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఏ.నారాయణపురం పంచాయ‌తీ తపోవనంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అనంత  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మూడున్న‌రేళ్ల‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల కలిగిన లబ్ధిని ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వివరించారు. ప్రత్యేక బుక్‌లెట్‌లను పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేరుగా పథకాలను ప్రతి గడపకు అందిస్తున్నామని తెలియజేశారు.  డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణాలకు సంబంధించి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే అనంత దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కార చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి చంద్ర, ఎంపీపీ , జేసీఎస్‌ కన్వీనర్‌ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఎంపీటీసీ నాగేంద్ర,కార్పొరేటర్ శ్రీనివాసులు, పార్టీ నాయ‌కులు జగన్‌మోహన్‌రెడ్డి, మల్లెల వేణుగోపాల్, బి.మదన్‌మోహన్‌రెడ్డి, హాజివలి, కృష్ణారెడ్డి, బషీర్,పుల్లారెడ్డి, జాఫర్, రామానుజన్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి,  రమణారెడ్డి,రాధాకృష్ణ,రత్నమయ్య,అనిల్ గౌడ్,భారతి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top