నెల్లూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ బాబా అయితే..ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వాట్సాప్ బాబా అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.తిరుపతి ఉప ఎన్నికతో టీడీపీ బంగాళఖాతంలో కలిసినట్లే అని ఆయన పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు.భారీ మెజారిటీతో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ప్రజలు గెలిపించారన్నారు. ఇంతటి ఘన విజయం వెనుక సీఎం వైయస్ జగన్‌పై ప్రజలు చూపిన ప్రేమ ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. సోమిరెడ్డిని అభివృద్ధి నిరోధకుడిగా ప్రజలు గుర్తించాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు.