రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: జమిలి ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌ వేదికగా ధ్వ‌జ‌మెత్తారు. ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..? జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో 
ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ?  అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్ చేశారు. కూటమి నేతల దారుణాల్ని చూసి తాము టీడీపీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. .

ఎక్స్ వేదికపై ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. 

  • ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..?
  • జమిలి....జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో 
  • ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? 
  • టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, రేప్ లు చూసి టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..?
  • కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక అవినీతి దొంగసొమ్ము వాటాలు పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటల తో ఐదునెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత  నేపథ్యంలో మతిమరుపువ్యాధితో చంద్రబాబు సతమతమౌతూ లోకేష్ ని  ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నం లో ఉన్నారా ? 
  • అరాచకాలకు పాల్పడుతున్న క్యాడర్, క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు మంత్రులు, నిద్రాణవస్థలోకి చేజారిన అధికారయంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
  •  
Back to Top