దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి 

మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు

పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి

వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదా?

 

అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పే ధైర్యం ఉందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుంచి  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల చంద్రబాబు, నారా లోకేశ్ చేసిన విమర్శలను విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. 'మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు అంటూ మండిపడ్డారు. దేవాన్ష్ ను తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?' అని విజయసాయి రెడ్డి సవాలు విసిరారు.

 అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ... 'పది వేల రూపాయల లోపు డిపాజిట్ చేసి మోస పోయిన 3.70 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైయస్‌ జగన్ నిధులు పంపిణీ చేసి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మీకిది కనిపించట్లేదా చంద్రబాబు గారూ. కుక్కలను ఉసిగొల్పి మొరిగించే బదులు ఇలాంటి మంచి పనులను ప్రశంసిస్తే హుందాగా ఉంటుంది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Read Also: సీపీఎం నేత మధుకు సీఎం పరామర్శ

Back to Top