సీఎం వైయ‌స్ జగన్‌కు ప్రధానమంత్రి మోదీ ఫోన్ 

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో పరిస్థితులను, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రధానికి నివేదించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. సహాయ కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని ఆయన ప్రధానికి తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సీఎంకు చెప్పారు.

Back to Top