మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు

పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో  టెలికాన్ఫరెన్స్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్‌కు నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆయన దూరమై 15 ఏళ్లయినా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

వైయస్ఆర్ ఆశయాలను సిద్ధాంతాలుగా చేసుకుని వైయస్.జగన్  పార్టీని స్థాపించారు.

ఆయన మొదలు పెట్టిన పథకాలకు గత 5 ఏళ్లలో పూర్తి రూపం ఇచ్చాం.

వ్యవస్థల్లో మంచి మార్పులు తీసుకొచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే మమేకం.

పేదరికాన్ని పారదోలి సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించిన ఘనత వైయస్ఆర్ సీపీది.

జిల్లా స్ధాయి మొదలుకుని నియోజకవర్గ, మండలస్ధాయి వరకు వైయస్ఆర్ జయంతి కార్యక్రమాలు

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

తాడేపల్లి: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ఘనంగా నిర్వహిద్దామని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు జూలై 8వ తేదీన( సోమవారం) వైయస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించాల్సిన కార్యక్రమాలపై  పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో  సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పలు సూచనలు చేశారు. 

సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి  75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా చేస్తున్నట్టుగానే పలు సేవాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవైయస్ఆర్ విగ్రహాలును  శుభ్రం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. 
దివంగత నేత వైయస్ఆర్‌కు ఘన నివాళులర్పించడంతో పాటు ఏటా చేస్తున్నట్టుగానే సేవా కార్యక్రమాలు చేయాలని పేర్కొన్నారు. ఈ దఫా 75వ జయంతి కావడం ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ఆయన మరణించి 15 సంవత్సరాలైనా… ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. 
ఆయన ఆలోచనలను సిద్ధాంతాలుగా చేసుకుని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని..  ప్రజల్లో మమేకమైన నాయకుడు ఎలా ఉండాలి అన్నది ఆయన ద్వారా నేర్చుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల్లో మమేకమైన పార్టీగానే  నడిచిందన్నారు. ఆయన మొదలు పెట్టిన పథకాలకు గత 5 ఏళ్లలో ఒక పూర్తి రూపం ఇవ్వడమే కాకుండా, వాటికి మరిన్ని జోడించి వ్యవస్థల్లో మంచి మార్పులు తీసుకొచ్చామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో తొలిసారి పేదరికాన్ని పారదోలి, సమాన అవకాశాలను అందరికీ కలిగించే విధంగా పేదలకు చేదోడుగా నిలబడి, చేయి పట్టుకుని నడిపిస్తూ, సుస్థిరమైన అభివృద్ధి, అభ్యుదయం దిశగా రాష్ట్రాన్ని నడిపిన ఘన చరిత్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈరోజు ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా మనం చేసిన మంచి పనుల వల్ల వచ్చిన మార్పులు మన కళ్ల ముందే కనపడుతున్నాయన్నారు. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకుందని,  ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు దాటిందని, పథకాల లబ్ధిదారులంతా ఓటు రూపంలో మనకు అండగా నిలుస్తారనుకున్నామని.. . కానీ తెలుగుదేశం పార్టీ  ఇచ్చిన తప్పుడు హామీలు, మోసపూరిత, అమలు సాధ్యం కానీ హామీలను ప్రజలు నమ్మి ఉండొచ్చు. అందువల్లే ఈ ఫలితాలు వచ్చాయని సజ్జల అభిప్రాయపడ్డారు. ఇవి కాక ఇతరకారణాలు కూడా ఉండొచ్చన్నారు. పోలింగ్ తర్వాత అటువైపు కక్షపూరితంగా దాడులు చేయడం, టెర్రర్ క్రియేట్ చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రాక ముందు నుంచే మొదలు పెట్టి వచ్చిన తర్వాత చేస్తున్నారన్నారు. 

అయినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల్లో మమేకమై ఉంటుందని స్పష్టం చేసారు. ఈ నెల 8 వ తేదీ వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఘనంగా వైయస్ఆర్ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏర్పాట్ల గురించి ఇప్పటికే సమాచారం అందించామన్నారు. విగ్రహాలను సిద్ధం చేసి కింది స్థాయి వరకు  పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అందరూ అక్కడికి చేరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగేలా చూడాల్సిందిగా కోరారు. దీని ద్వారా మళ్లీ పార్టీ రెగ్యులర్ యాక్టివిటీస్ లోకి పోయే విధంగా ఇది స్టార్టింగ్ పాయింట్ గా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని, అందుకే ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా, నియోజకవర్గాల్లో కార్యక్రమం ఘనంగా జరగాలని, మండల స్థాయిలో కూడా జరిగేలా స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేయాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. 

Back to Top