తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. ఏప్రిల్ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస జగన్‌కు పీఠాధిపతులు ఆహ్వానపత్రిక అందజేశారు. పీఠాధిపతులు డాక్టర్ మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఆహ్వానపత్రిక అందజేసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్, రామచైతన్య (ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్), వీరేష్ ఆచార్య (కో-ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్) పాల్గొన్నారు.