ముస్లింలకు వైయ‌స్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

 తాడేప‌ల్లి: ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం తన ఎక్స్‌ ఖాతాలో ఆయన సందేశం ఉంచారు.  
కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్.  దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

 
త్యాగ­నిరతికి, ధర్మ­బద్ధ­తకు, దాతృత్వానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుంద­న్నారు. దైవ ప్రవక్త ఇబ్ర­హీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నా­రు. పేద, ధనిక తారత­మ్యాలు లేకుండా, రాగద్వేషా­లకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండు­గను భక్తిశ్రద్ధలతో నిర్వ­హించుకుంటారని చెప్పారు. అల్లాహ్‌ ఆశీ­స్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు.

 

Back to Top