తాడేపల్లి: జాతి పిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శనీయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేడు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. అహింస వాదంతో ఏమైనా సాధించవచ్చని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి చూపించిన మహనీయుడు ఆయన. గాంధీగారి సిద్ధంతాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శనీయం అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.