తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీ చేపట్టారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా వింగ్) పూడి శ్రీహరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, నాగార్జున యాదవ్ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి భరతమాత విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అమరుల కుటుంబాలకు సంఘీబావంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... కశ్మీర్‌లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికిపందల చర్య, ఇది మానవత్వంపై జరిగిన దాడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాం. ఆ కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్రమైన భావనతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ఈ టెర్రరిస్ట్‌ల దాడులు మా ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవు, ఈ విషయంలో మా అధ్యక్షుడు జగన్ గారి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటుంది, ఈ దారుణ ఘటనలో ఏపీ నుంచి మరణించిన రెండు కుటుంబాలను కూడా మా పార్టీ సీనియర్ నాయకులు పరామర్శిస్తారు, మిగిలిన కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇలాంటి ఉగ్రవాద చర్యలపై నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంటుంది. వైయస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.