వైయస్ఆర్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ఆయన తనయుడు, వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఉదయం వైయస్ జగన్ పులివెందులకు చేరుకున్న వైయస్ జగన్ ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో వైయస్ జగన్, కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.