రేపు చలో తుని

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు దాడిశెట్టి రాజా పిలుపు

కాకినాడ:  మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేపు(మంగ‌ళ‌వారం) చలో తునికి  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రేపు తుని రావాలని కోరారు. తుని మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేత‌ల తీరును ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ..‘మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నికను టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటోంది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నాడు. కలెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్ళాలి. గతంలో నాపై కేసు నమోదు చేశానని సీఐ చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవడం లేదు. రేపు చలో తునికి పిలుపునిస్తున్నాం. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రేపు తునికి రావాలని కోరుతున్నట్టు’ దాడిశెట్టి రాజా తెలిపారు. 

Back to Top