సూపర్ సిక్స్‌ అమలు చేయడంలో  కూటమి స‌ర్కార్ విఫ‌లం

వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి  

 అనంత‌పురం:  ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల‌ను అమ‌లు చేయ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా ఉపాధ్యక్షురాలు వై. నైరుతి రెడ్డి మండిప‌డ్డారు.  గుంతకల్లు పట్టణంలోని మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నైరుతి రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్న ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీల ఊసే ఎత్త‌డం లేదు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజాం. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అని గొప్ప‌లు చెప్పుకోవ‌డం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేసి చిత్త‌శుద్ధిని నిరూపించుకోవాలి.   ఎలాంటి అనుభవం లేని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే ఎన్నికలలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశారు. ఎన్నికల ముందు ప్రచారంలో ఉగిపోయి‌న పవన్ కళ్యాణ్ మ‌హిళ‌లు, బాలిక‌పై అత్యాచారాలు జరుగుతున్నా నోరు మెద‌ప‌డం లేదు. నారాయణ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప‌వ‌న్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం  మీడియా మిత్రుల‌ను బెదిరించ‌డం స‌రికాదు.  పత్రిక స్వేచ్చను ప‌రిర‌క్షించేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంద‌ని నైరుతిరెడ్డి పేర్కొన్నారు. 

Back to Top