రాష్ట్ర‌వ్యాప్తంగా పోలీసుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఫిర్యాదు 

వైయస్ జగన్‌పై అసభ్యకర పోస్టులు పెడుతున్న టీడీపీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని విన‌తులు

అమ‌రావ‌తి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర‌వ్యాప్తంగా పోలీసుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఫిర్యాదు చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ నేతల‌ను  కించపరిచేలా పెడుతున్న పోస్టులపై ఆధారాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీలకు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఫిర్యాదులు చేస్తున్నారు.

విశాఖపట్నం జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజితకు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు, మాజీ శాసన సభ్యులు వాసు పల్లి గణేష్ కుమార్, అన్నంరెడ్డి అదిప్ రాజ్, వైయస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. 

కాకినాడ జిల్లా: కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కక్షసాధింపు తప్పా మరో వ్యాపకం లేదని.. వేధింపులు ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని  వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదనపు ఎస్పీ భాస్కరరావుకు ఆయన ఫిర్యాదు చేశారు. 
చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీని ఎప్పటి నుండో నడుపుతున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్‌ చంద్రబాబుకు అలవాటుగా మారింది. టీడీపీ కార్యాలయం కేంద్రంగా సోషల్ మీడియా దుష్ప్రచారానికి తెర తీశారు. ఈ మాట డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పాడు. టీడీపీ తన పద్దతి మార్చుకోవాలి. మాజీ సీఎం వైయ‌స్ జగన్, ఆయన కుటుంబంపై వచ్చిన సోషల్ మీడియా పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని కన్నబాబు తెలిపారు.

అరాచక పాలన పై పోరాటం చేస్తాం: అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం: వైయ‌స్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్‌లు వస్తున్నాయని.. టీడీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోరా? అంటూ  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు. వైయ‌స్ జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మేసేజ్‌లు పెట్టిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అంటే ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయమంటే చంద్రబాబు ఉలికిపడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబు అరాచక పాలనపై పోరాటం చేస్తాం’’ అని అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. అనంత‌పురం జిల్లా డీఎస్పీ ఆఫీస్‌లో.. జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి , వైయస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు.

 
స‌త్య‌సాయి జిల్లా: 
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్‌పై, ఆయ‌న‌ కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా  సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన ఆధారాలతో పాటు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు కే.వి.ఉషాశ్రీచరణ్  ,వైయస్ఆర్ సీపీ నాయకులు

అక్రమ అరెస్ట్‌లు.. హేయమైన చర్య: దూలం నాగేశ్వరావు
ఏలూరు జిల్లా: కూటమి ప్రభుత్వం చేపట్టిన సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌కు ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, చింతలపూడి కన్వీనర్ విజయరాజు, ఏలూరు కన్వీనర్ జయప్రకాష్ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్టులపై నేడు విమర్శించినట్లుగా అరెస్టులు చేయడం హేయమైన చర్య. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. వారిని ఎక్కడ ఉన్నారో కూడా తెలపడం లేదు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అడిగినా చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు.

అల్లూరి జిల్లా:
వైయ‌స్ జ‌గ‌న్‌పై అసభ్యకర పోస్టులు పెడుతున్న టీడీపీ  కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, వైయస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

Image
అక్రమాలను ప్రశ్నిస్తే.. కేసులా: ధర్మాన కృష్ణదాస్‌
శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మెంటాడ పద్మావతి, నాయకులు పొన్నాడ రుషి, ఎడ్ల వెంకట్ ,అంబటి శ్రీను ఇతర నాయకులు పాల్గొన్నారు.

జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలనకు స్వస్తి పలకాలన్నారు. జిల్లాలో ఏ సోషల్ మీడియా కార్యకర్తని ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. అరెస్టు చేసిన కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో కూడా తెలపడం లేదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించారనే అక్కసుతో మా సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసు  దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం 

పోలీసు యంత్రాంగం చంద్ర‌బాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్లి మాన‌వ  హ‌క్కుల‌ను హ‌రిస్తోంద‌ని, పోలీసు దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం చేస్తుంద‌ని ఉమ్మడి విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. శ‌నివారం జిల్లా పరిధిలో పార్టీ నేత‌ల‌లు, సోషల్ మీడియా కార్యకర్తలుతో క‌లిసి స్థానిక డి.ఎస్.పి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని టీడీపీ కూటమి అసమర్థ పాలనను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే వేధిస్తున్నారని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్న శ్రీను మండిపడ్డారు.

Image

ఐటీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు: వరుదు కల్యాణి
విశాఖపట్నం: కూటమిపాలనలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘ఏపీలో ఉన్నామా?  ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా? సోషల్ మీడియా కార్యకర్తల పేరుతో మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మహిళని చూడకుండా సంధ్యారాణిని పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు పోస్టింగులు పెడుతున్న ఐటీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు. పవన్ కల్యాణ్‌ తల్లిని తిట్టించిన లోకేష్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image

 ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరించే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

నంద్యాల జిల్లా:
మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్  కాంగ్రెస్  పార్టీ  అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్ గారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న టీడీపీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని  నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యేలు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, గంగుల బీజేంద్ర‌, ఎమ్మెల్సీ ఇసాక్‌, ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ,నంద్యాల జిల్లా వైయస్ ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు.

Image

Back to Top