తాడేపల్లి: సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్ కుటుంబ సభ్యులను వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ను సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి సుజన కలిశారు. పోలీసులు తన భర్తను వేధించారని, బలవంతంగా సంతకం చేయించారని సుజన వైయస్ జగన్‌కు తెలిపారు. పోలీసుల తీరు అసలు బాగోలేదు. నా భర్తపై తప్పుడు కేసులు పెట్టి గతనెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ధైర్యం చెప్పి..అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం సుజన మీడియాతో మాట్లాడుతూ..ఇంటూరి రవికిరణ్‌ను గత నెల 21 నుంచి పోలీసులు వేధిస్తూనే ఉన్నారు, గుడివాడలో రెండు కేసులు, అరండల్‌పేటలో ఒకటి, వైజాగ్‌లో రెండు ఇలా మొత్తం 9 కేసులు పెట్టారు, గుడివాడ, గుంటూరు పోలీసులు పీఎస్‌ల చుట్టూ తిప్పిన తర్వాత దువ్వాడ పోలీసులు వచ్చి సంతకం పెట్టాలని తీసుకెళ్ళి పీఎస్‌లో దారుణంగా ప్రవర్తించారు పోలీసులకు పైనుంచి వస్తున్న ఫోన్లను ఫాలో అయి దానికి సంబంధించినట్లు చేస్తున్నారు, ఒక స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ వచ్చి బయటికి రాగానే ఇంకో పీఎస్ పోలీసులు వచ్చి తీసుకెళుతున్నారు, ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా చెప్పరు, ఏ కేసు అనేది చెప్పరు, కేసుల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు రాజమండ్రి సీఐ చాలా దారుణంగా ప్రవర్తించాడు, రవి చెప్పనివి కూడా చెప్పినట్లు రాసి సంతకాలు పెట్టించుకున్నారు, రిమాండ్‌కు తరలించారు, మమ్మల్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, మేం జగనన్నకు కలిసి ఇదంతా వివరించాను, జగనన్న భరోసా ఇచ్చారు, జగనన్న మాకు అండగా ఉంటామన్నారు పోలీసులపై నేను కూడా ప్రేవేట్ కేసులు వేస్తాను, రాజమండ్రి పోలీసులు రవికిరణ్‌ను దారుణంగా ప్రవర్తించారు, రాజమండ్రి ప్రకాష్‌నగర్ సీఐ తనను కొట్టారు, నా భర్త ఎలాంటి అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టులు పెట్టలేదు. ఈ కేసులన్నీ న్యాయపరంగా ఎదుర్కొంటాం. కాగా,సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ప్రకాష్‌నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను అరెస్టు చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారు. దీంతో ఆందోళన చెందిన ఆమె హుటాహుటిన సోమవారం తెల్లవారుజామున ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన భర్త రవికిరణ్ ఆచూకీ తెలపాలని కోరారు. హార్ట్ పేషెంట్ అయిన తన భర్త మందులు వేసుకోవాలని పోలీసుల్ని బతిమాలారు. 12 గంటలపాటు స్టేషన్‌లోనే ఉన్న ఆయన్ని తనకు చూపించాలని కోరారు. అయినా పోలీసులు కనికరించలేదు. సెంట్రల్‌జోన్ డీఎస్పీ రమేష్‌బాబు ప్రకాష్‌నగర్ స్టేషన్‌కి రాగానే ఇన్‌స్పెక్టర్ బాజీలాల్ ఎఫ్‌ఐఆర్ సిద్ధం చేశారు. అనంతరం రవికిరణ్ భార్య సుజనను సంతకం చేసేందుకు పిలిచారు. ఏ నేరం చేశారని తన భర్తను అరెస్టు చేశారంటూ సుజన పోలీసులను నిలదీశారు. చివరకు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రవికిరణ్‌కు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు తరలించారు.