బాబుకు అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  సీఎం చంద్రబాబుకు అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా కామెంట్స్‌ చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు.

‘చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ.. ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. 

Back to Top