వంద రోజుల పాల‌న అట్ట‌ర్‌ఫ్లాప్‌

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ పోతిన మహేష్‌
 

విజయవాడ: వందరోజుల్లో చేసింది చెప్పుకోలేక తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. పరిపాలన గాలికొదిలేసి, ఇస్తామన్న పథకాలు ఇవ్వకుండా తన చేతకానితనం బయటపడినప్పడు వైయ‌స్‌ జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్‌లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ సేకరించారు. రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలు భక్తుల్లో ఉన్నాయి. నాణ్యత లేకపోతే  నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు తగ్గకూడదని గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 550 దేశీ ఆవులతో గోశాల ఏర్పాటు చేసింది కూడా గత ప్రభుత్వమే..ఇది కనిపించడం లేదా?’’ అంటూ పోతిన మహేష్‌ దుయ్యబట్టారు.

 
‘‘శ్రీవైష్ణువులు తేడా జరిగితే చెప్పారా? ఎందుకు ఊరుకుంటారు?. లడ్డు సరుకులను ముందుగానే తనిఖి చేస్తారు.. సరిగ్గా లేకుంటే తిరిగి పంపిస్తారు. లడ్డూ తయారికి ముందే సరుకులు తనిఖి చేస్తారు. లడ్డు తయారీ తర్వాత తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఏ కాలానికి వచ్చింది.. ఎప్పుడు వచ్చింది. ఏ ట్యాంక్‌లో వచ్చింది చెప్పకుండా కోట్లాది హిందూ భక్తుల మనోభావాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. వెంకన్న భక్తులు చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి జవాబు ఇస్తారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయంగా వాడుకోవాలని చూడడం సరైనది కాద‌ని పోతిన మహేష్‌ హితవు పలికారు.

Back to Top