చంద్రబాబు స్ట్రైక్  రేట్ ఎంత?

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంతో పలు ప్రశ్నలు సంధించారు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విపత్తు నిర్వహణలో పూర్తి వైఫల్యం అనిపించుకున్న చంద్రబాబు స్ట్రైక్  రేట్ ఎంత?. అలాగే, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందింది! అని ఎక్స్‌ వేదికగా ఓ సందేశం ఉంచారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా సంధించిన ప్ర‌శ్న‌లు

ఏపీలో పాలన వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్!

ఏపీకి తిరిగి ఊపిరి తీసిన ఎవరికి ఎన్ని మార్కులు..?

100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా!

ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, తీవ్ర అసంతృప్తి చెందారా..?

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందింది!

40 సంవత్సరాల ఇండస్ట్రీగా స్వయంప్రకటిత చంద్ర బాబుకు ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల్లో కుల ప్రాతిపదికే ప్రామాణికంగా జరిగాయన్న విమర్శలు ఎందుకు వచ్చాయి..?

అసంతృప్తితో రగిలిపోతున్న కూటమి నేతలను పట్టించుకోవడం లేదా!

విపత్తు నిర్వహణలో పూర్తి వైఫల్యం అనిపించుకున్న చంద్రబాబు స్ట్రైక్  రేట్ ఎంత?

ఆరంభమే ప్రభుత్వ వ్యతిరేకత ఎందువల్ల!

ప్రజలదే అంతిమ నిర్ణయం! అంటూ కామెంట్స్‌ చేశారు. 

Back to Top