పొట్టిశ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం

ఆయన్ను స్మరించుకుంటూ అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్నాం

గత ప్రభుత్వం రోడ్ల మీద పడి దీక్షల పేరుతో కామెడీలు చేసింది

తెలుగు పత్రికా రంగం వర్గాలుగా చీలిపోయింది

కులం, స్వప్రయోజనాల కోసం ఓ వర్గం పనిచేస్తోంది

పత్రికా స్వేచ్ఛను హరించే దురుద్దేశం ప్రభుత్వానికి లేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: స్వర్గీయ పొట్టిశ్రీరాములు త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఘనంగా జరుపుతుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 2014 నుంచి 2018 వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పక్కనబెట్టి నవ నిర్మాణ దీక్షలు పేరుతో రోడ్ల మీద పడి చంద్రబాబు కామెడీలు చేశారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టిశ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పిస్తే 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆ తరువాత 1956 నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందన్నారు. ఆ రోజు నుంచి 2014 వరకు నవంబర్‌ 1వ తేదీ అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ వీడిపోయిన తరువాత 2014లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన రోజున నవ నిర్మాణ దీక్షలని రోడ్ల మీద మీటింగులు పెట్టి కామెడీ చేసిందన్నారు. వాటన్నింటికీ తెర దించుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్ల ఆంధ్రరాష్ట్రం ఏర్పడడం ఈ పరిణామాలన్నింటినీ గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవం జరుపుతుందన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని వివాదం చేసి దాని నుంచి రాజకీయ లబ్ధిపొందాలనే తాపత్రయం గత ఐదు నెలలుగా చంద్రబాబు చేస్తున్నారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ప్రతికా స్వేచ్ఛను హరించే ప్రభుత్వంగా కొన్ని వర్గాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. దీనికి అతిపవిత్రమైన రాజ్యాంగం ఉందని, ఆర్టికల్‌ 19/1ఏ ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉందని, ఆ క్రమంలోనే పత్రికలకు తమ అభిప్రాయలను, వార్తలను ప్రచురించే స్వేచ్ఛ ఉందన్నారు. పత్రికా స్వచ్ఛను దుర్వినియోగం చేస్తున్నప్పుడే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయన్నారు.

తెలుగు పత్రికారంగం కొన్ని వర్గాలుగా చీలిపోయింది. స్వప్రయోజనాలు, వర్గ ప్రయోజనాల కోసం ఒకరిపై కక్షసాధింపు చర్యలుగా వార్తలు రాయడం కోకొల్ల్లలుగా చూస్తున్నామన్నారు. ఏమీ లేకపోయినా.. ఒక నాయకుడిని ఎత్తుకొని, ఏదో అద్భుతం జరుగుతుందని ప్రజల్లో గందరగోళం సృష్టించి అనుకూలమైన వేవ్‌ క్రియేట్‌ కొన్ని పత్రికలు, మీడియా చానళ్లు పనిచేస్తున్నాయి. అదే రీతిలో మరో నాయకుడిపై బురదజల్లే కార్యక్రమం విస్తృతంగా చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో.. వ్యక్తుల స్వేచ్ఛకు కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుందని తప్పుడు వార్తలు రాసే ఆ పత్రికలకు మర్చిపోవద్దని సూచించారు.  వార్తలు న్యాయంగా రాయాలి. ధర్మంగా రాయాలి. వాస్తవాలు రాయాలి కానీ, లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా రాసి వేరొకరి స్వేచ్ఛను హరించాలని చూడడం అప్రజాస్వామికం అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే దురుద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద అత్యంత విశ్వాసంతో ప్రభుత్వం ఉందన్నారు.   

   

Read Also: శవ రాజకీయాలు

Back to Top