నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. చెప్పినదానికంటే రూ. వెయ్యి అదనంగా పెంచి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నేరస్థులను ప్రోత్సహించింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. Read Also: వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య