తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయడం సరికాదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎన్నికలకు ముందు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పథకాలు కొత్తగా తీసుకురాలేదు. ఆన్ గోయింగ్ పథకాలకు ఎటువంటి అడ్డంకులు గతంలో లేవన్నారు. మంగళవారం మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ తీరుపై మీడియాతో మాట్లాడారు. మల్లాది విష్ణు ఏమన్నారంటే.. ఏపిలో మాత్రమే కొన్ని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ను నిలిపివేయాలని ప్రయత్నించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మార్చి1,మార్చి 6వతేదీన సీఎం వైయస్ జగన్ గారు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ,విద్యాదీవెన ఏటా విడుదల చేస్తారు. రాష్ర్ట ప్రభుత్వం ఈసికి సవివరంగా క్యాలెండర్ ద్వారా ఆన్ గోయింగ్ స్కీమ్స్ అమలుచేసేతీరు వివరించింది. ఎన్నికల కమీషన్ అయినా కూడా నిలిపివేయాలనే నిర్ణయం వెనక బిజేపితో వత్తిడి చేయించారని అనిపిస్తోంది. ఇందుకోసమే టిడిపి,జనసేనలు పొత్తుపెట్టుకున్నాయా అనిపిస్తోంది. ప్రజలకు మేలు చేసే ప్రోగ్రామ్స్ ను అడ్డుకోవడం చంద్రబాబుకు తొలినుంచి అలవాటే. ఇన్ పుట్ సబ్సిడి రైతులకు అవసరానికి ఆసరాగా ఉంటుంది.విద్యాదీవెన సైతం విద్యార్దులకు అవసరం. పేదప్రజలకు,రైతులకుచేయూత,ఈబిసి నేస్తం,ఆసరా వంటి పధకాలను కూడా ఎందుకు ఆపుతున్నారనేది తెలియాలి. ఆపడానికి అదృశ్యశక్తి ఎవరంటే బిజేపి,టిడిపి,జనసేన అనేది అర్దమవుతుంది. జగన్ గారు మంచిపరిపాలన అందించి అన్నింటా అభివృద్ది పధంలో పయనింపచేస్తుంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇసుక,మద్యం,మట్టి అంటూ విమర్శలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అవినీతి అంటూ ముద్రవేస్తున్నారు.మా పార్టీ తో తలపడలేక రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నాం.సంస్కరణలతో ఏపి అభివృధ్ది చెందుతుంటే అధికారం కోసం జగన్ గారిపై నిందలు వేస్తున్నారు. సంస్కృతిని కాపాడతాం అంటూ కొందరు మాట్లాడుతున్నారు.నిజానికి సంస్కృతిని సంరక్షిస్తున్నదే వైయస్సార్ సిపి. 2014-19 మధ్య ఎన్టీఏ ప్రభుత్వం ఉన్న సమయంలోనే పుష్కరాలలో 30 మందిని ప్రచారయావకోసం బలితీసుకున్నారు.అది సనాతన ధర్మం పై దాడి కాదా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.