విద్యార్థులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ ‘పోరుబాట’

ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరాటం

 గుంటూరు : రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాట కు వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది. పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది. త్వరలో ఈ పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనుంది.

ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా  ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్‌ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత విద్యార్థులకు అండగా పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధమైంది. 

బాబు సర్కార్‌కు డిమాండ్లు:

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి 
  • వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి 
Back to Top