ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు

గుడివాడ మేమంతా సిద్ధం స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం కనిపిస్తోంది 

మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది

సమర శంఖం పూరిద్దామా..  పెత్తందార్లపై యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?

కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్‌ మీద.

మీకు మంచి చేసిన మీ జగన్‌ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. 

అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు

కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ.

చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు

జగన్‌ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ 

పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు
 
రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే
 
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే
 
విప్లవాత్మక మార్పులు మీ బిడ్డ పాలనలో జరిగాయి
 
58 నెలల్లోనే మీ బిడ్డ సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకొచ్చాడు

ప్రతి గ్రామంలోనూ మీ జగన్‌ మార్క్‌ కనిపిస్తోంది
 
మరి ఇంటింటి  అభివృద్ధి కొనసాగాలా.. వద్దా?

మరి ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా.. వద్దా..

అందుకే మళ్లీ చెబుతున్నా.. ఈ ఎన్నికల్లో ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు..  రాబోయే ఐదేళ్లలో మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది

ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయనే ఆలోచన చేయండి

మరి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుందనే విషయం గుర్తు పెట్టుకోండి
 
2014లో కూటమిగా ఏర్పడి మోసం చేసిన వైనాన్ని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గుడివాడ‌: త‌న‌పై ఒక్క రాయి విసిరినంత మాత్రానా నా సంకల్పం చెక్కు చెదరద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థమన్నారు. ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గద‌న్నారు. మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర‌లో భాగంగా సోమ‌వారం గుడివాడ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే..

గుడివాడలో ప్రజా మహాసముద్రం
గుడివాడలో ఈ రోజ మహా సముద్రం కనిపిస్తోంది. ఇది ప్రజల సముద్రం. మే 13న జరగబోతున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇది. ఈ సభకు వచ్చిన నా  అక్క చెల్లమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు, ప్రతీ ఒక్కరికీ నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడుగా మీ బిడ్డ.. మీ జగన్... రెండు జోతులు జోడించి పేరు పేరునా కృతజ్జతలు తెలుపుకుంటున్నాడు. 

సమర శంఖం పూరిద్దామా?...
పేదల భవిష్యత్తు కోసం.. పథకాలన్నీ కాపాడుకోవడానికి, కొనసాగింపునకు, ఇంటింటి అభివృద్ధిని, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా...? మే 13న జరబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పేదల  భవిష్యత్తు కోసం 130 బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు  బటన్ లు ఫ్యాన్ గుర్తు పై నొక్కడానికి, వంద మందితో నొక్కించడానికి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేయడానికి మీరంతా సిద్ధమేనా..

మోసాలే అలవాటుగా పెట్టుకున్న పదిమంది జగన్‌పై దాడి
ఇక్కడున్నది మంచి చేసానన్న ధైర్యంతో నిలబడిన ఒక్క జగన్. చుట్టుముట్టినది.. గతంలో ఏ మంచీ, ఏ పేదకు చేయని, మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటు వైపున, ఒక్క జగన్ మీద ఎంత మంది దాడి చేస్తున్నారంటే.. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోంది. 

తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ బెదరడు....
మీ జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బీజేపీ, కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవన్నట్లుగా కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై మీ జగన్ మీద బాణాలు సంధిస్తున్నారు. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద. మీకు  ఆ మంచికి మధ్య మీ సేవకుడుగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు. అయినా  మీ బిడ్డ అదరడు, మీ బెడ్డ బెదరడు, కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. అర్జునుడు మీద ఓ బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రం గెలిచినట్లు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షుత్రంలో ఆ దుష్టచతుష్టయం, పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును  ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. మీరు ఈ స్థాయికి దిగజారారంటే దానికి అర్థం..  విజయానికి మనం చేరువగా ఉన్నామని, వారు దూరంగా ఉన్నారని అర్ధం. 
ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. మీకు సేవా చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. 

దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టు రాశాడు
నా నుదిట మీద వారు చేసిన గాయం కన్ను మీద.. తల మీద తగలలేదంటే దాని అర్థం.. దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టు రాసాడాని అర్థం.  నా నుదిట మీద వారు చేసిన గాయం బహుశా పదిరోజుల్లో తగ్గిపోతుంది ఏమో గాని, చంద్రబాబు ప్రజలకు చేసిన  గాయాలు పేదలు ఎన్నడూ మరిచిపోయే పరిస్థితి ఉండదు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ఇంటింటికి  మంచి చేయడం మీ బిడ్డ నైజం.

పేదలకు మంచి చేయని ఫిలాసపీ బాబుది
ఈ కూటమి నాయకుడు.. చంద్రబాబు.. 30 ఏళ్ల ఫిలాసఫీ ఒక్కసారి చూస్తే  పేద ప్రజలకు ఏ మంచి చేయకూడదన్నది బాబు ఫిలాసఫీ. బాబు ఎలాంటి వాడో అందరికీ ఆయన నైజం చూస్తే తెలిసిపోతుంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్నది..  తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అని అన్నది ఈ బాబే. కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వొద్దని, ఎన్టీఆర్ ను దింపేసి రూ. 5.25కి పెంచేసినది, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్న దౌర్భాగ్యం కూడా ఈ బాబే. ప్రభుత్వ బడుల్లో  ఇంగ్లీషు మీడియం వద్దు అన్నది, ప్రభుత్వ బడులను పాడు పెట్టినది.. ఈ బాబే.

పేదల ఇళ్ల స్ధలాలిస్తే కులాల సమతుల్యం దెబ్బతింటుందన్న బాబు
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల సమతుల్యం దెబ్బతుంటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసినది బాబు కాదా?.. తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే బీసీలను, ఎస్సీలను అవహేళన చేసిన  వ్యక్తి ఎవరు.. ఈ బాబే.. విడగొట్టిన రాష్ట్రానికి  ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు?.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు? బాబే. ఆ హోదాను తాకట్టు పెట్టినది ఈ బాబే. 

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచినదీ బాబే.
చివరకు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్  పిల్ల నిచ్చి చేరదీస్తే  చెప్పులు వేయించి వెన్నపోటు పొడిచినది చంద్రబాబు కాదా..  మల్లీ అవసరమైతే రామారావు గారి పొటో బయటకు తీసి ఆ ఫొటోకు దండలు వేస్తాడు.. ఇంత నీచమైన వ్యక్తి .. ఈ బాబే.  పేదలకు ఏ మంచి చేయవద్దన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు. ఈ మనిషికి మానవత్వం.. మంచితనం లేదు. దొంగ వాగ్ధానాలు, మోసం చేయడం, కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది.. పంచుకోవడం.... ఇదే చంద్రబాబుకు తెలిసిన నీతి.

బాబును నమ్మడం అంటే చేపలకు కొంగను కాపలాపెట్టినట్టు.
బాబును నమ్మడం అంటే   చెరవులో చేపలకు కొంగను కాపాలా పెట్డడమే..  దొంగ చేతికి తాళాలు ఇవ్వడమే.. పులి నోట్లో తల పెట్టడమే.. మరి మీ జగన్ ను చూడండి.. ఈ 58 నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో, దేవుడు ఆశీస్సులతో  గ్రామగ్రామాన ఇంటింటా జగన్ మార్కు ఏంటో మీరే చూడండి.

గతంలో లేని విధంగా గ్రామంలో ఏడువ్యవస్ధలు.
గతంలో ఎన్నడూ జరగనట్లుగా, రాష్ట్రంలో ఏగ్రామాన్ని తీసుకున్నా ఏకంగా ఏడు వ్యవస్థలు కనిపిస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లీనిక్కులు, మహిళా పోలీసులు, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ప్రతీ గ్రామంలోనూ  మీ బిడ్డ  మార్కు కనిపిస్తోంది.  మరి చంద్రబాబు మార్కు ఏమిటి.. జన్మభూమి కమిటీలు.
పచ్చ పాముల అవినీతి కాట్లు,  లంచాల గాట్లు..  

అదే మీ బిడ్డ మార్కు చూస్తే  అవినీతి, వివక్ష లేకుండా నేరుగా మీ చేతికి అందించే సేవలు, స్కీములు. ఇదే తేడా గమనించాలి. పౌర సేవల్లో  మనం తీసుకువచ్చిన మార్పులను కూడా గమనించాలి. దేశచరిత్రలో రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా అవ్వాతాతలకు రూ. 3 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా.. ఇంటి వద్దకే రేషన్.. ఇంటి సమీపంలోనే జనన, కుల ధృవీకరణ పత్రాలతో సహా.. 600 రకాల సేవలు అందిస్తున్నాం. 
మన గ్రామంలోని ప్రతీ 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఇంతటి వ్యవస్థలను గతంలో ఎన్నడైనా చూసారా?. కేవలం ఈ 58ల నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలో కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం చేసాడు.. చంద్రబాబు చేసిందేంటంటే జన్మభూమి కమిటీలను ముందర పెట్టి  గ్రామాన్ని, రాష్ట్రాన్ని దోచేసాడు. మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ఇంటింటికి మంచి చేసాడు. రైతన్నకు చెప్పినది  ప్రతీ ఒక్కటీ చేసాను. రైతన్నలకు తొలిసారిగా పెట్టుబడిగా తోడుగా రైతు భరోసా ఇస్తున్నదీ.. మీ బిడ్డ పాలనలోనే.. పగటి పూట ఉచిత విద్యుత్,  ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత  భీమా, ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్, అమూల్‌తో సహకార రంగం పటిష్టం చేసినది ఎవరంటే మీ బిడ్డ ,మీ జగన్.

మీ గ్రామంలో రైతన్న చేయి పట్టుకుని నడిపిస్తూ.. ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చినది ఎవరంటే.. అది కూడా మీ జగన్.  వంద సంవత్సరాల తర్వాత 30 లక్షల భూముల మీద సర్వే చేపట్టి సర్వ హక్కుల కల్పించనదీ .. మీ జగన్.

14 ఏళ్లు సీఎంగా  ఉన్న చంద్రబాబు  రైతుకు మంచి చేయకపోయినా సరే  చెడు చేసిన బాబుకు ఎల్లో మీడియాకు 58 నెలల్లో చేసిన పథకాలు  చూస్తే  కడుపు రగిలిపోకుండా ఉంటుందా..  విద్యా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను, తల్లితండ్రులను ప్రొత్సహించాం. అమ్మఒడి, విద్యా కానుక, నాడు - నేడు, గోరు ముద్దు, డిజిటల్ బోధనలు, ట్యాబులు, పెద్ద చదవులకు  ఏ తల్లీ, తండ్రీ ఇబ్బంది పడకూడదని ఫీజు రియింబర్స్ చేస్తున్నాం.  విద్యాదీవెన, వసతి దీవెన, మూడో తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్‌. మూడో తరగతి నుంచే టోఫెల్ ను సైతం ఒక పీరియడ్‌గా పెట్టాం. సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు పిల్లల ప్రయాణం. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వ విద్యాలయాల్లో ఇక్కడ నుంచే చదువుకునేలా సరికొత్త  విప్లవాత్మక మార్పులు చేసినదీ..ఆన్‌లైన్  మీ బిడ్డ పాలనలోనే.. మన వైఎస్సార్ సీపీ పాలనలోనే జరిగింది.

చదువుల విప్లవం కనిపిస్తే బాబు కడుపు మండదా?
మరి ఇన్ని చదువుల విప్లవాలు కళ్లెదుటే కనిపిస్తే చంద్రబాబుకు కడుపు మండదా...  ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే నారాయణ, చైతన్య కోసం బలి పెట్టిన చదువులు గుర్తుకు వస్తాయి. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకు వస్తాయి. వైద్య రంగంలో కూడా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శ్రీని వేయి నుంచి మూడు వేల ప్రొసీజర్లకు విస్తరించడంతో పాటుగా రూ. 25 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నది మీ బిడ్డ  పాలనలోనే... మీ జగన్ పాలనలోనే.. ఆరోగ్య ఆసరా తో ఉపాధి భృతిని కూడా మీ బిడ్డ  పాలనలోనే అందిస్తు్న్నాం.

మీ బిడ్డ పాలనలో మారిన గ్రామాలు.
మొట్టమొదటి సారిగా గ్రామాలు మారాయి. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్, ఫ్యామిలీ డాక్టర్, అరోగ్య సురక్ష, నాడు - నేడుతో ఆసుపత్రుల రూపు రేఖలు మారాయి. ఏకంగా 54 వేల కొత్త నియామకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసాం. మరో 17 మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి.. ఇవన్నీ జరిగింది.. ఎప్పుడు.. చేసినది ఎవరు. మీ బిడ్డ పాలనలోనే.  మరి చంద్రబాబు కడుపు మండదా, వైద్యారోగ్య రంగంలో  బాబు మార్కు ఎక్కడుంది.

అక్కచెల్లమ్మల సాధికారతకు చంద్రబాబు విలన్‌గా  కనిపిస్తాడు. వాగ్దానాలతో వంచించడంలో  బాబుకున్న అనుభవం ఇంకెవరకీ లేదు.అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచాడు. మీ బిడ్డ ట్రాక్ రికార్డు చూస్తే అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం,  కాపునేస్తం, 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ అంటే మీ జగన్.. పిల్లల పెద్ద చదువులకు విద్యా దీవెన, వసతి దీవెన అంటే మీ జగన్. అక్క చెల్లమ్మలకు అండగా వారికి ప్రొత్సాహం ఇస్తూ కల్యాణ మస్తు, షాదీ తోపా, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను ఇస్తున్నాం. 50 శాతం పనుల్లోనూ, పదవుల్లో రిజిర్వేషన్ల ఇచ్చినది మీ జగన్‌. 

స్వయం ఉపాధితోనే వారి జీవితాలు బాగుపడతాయని ఎన్నడూలేని విధంగా చేదోడు, వాహన మిత్ర, మత్స్యకార భరోసా  వంటివి ఏది చూసినా మీ జగన్.
లా నేస్తం చూసుకున్నా గుర్తుకు వచ్చేది మీ జగన్. గతంలో నాలుగు లక్షల  ప్రభుత్వ ఉద్యోగాలుంటే, కొత్తగా రెండు లక్షల ముప్పైవేల ఉద్యోగాలు ఇచ్చినది మీ బిడ్డ. నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. నా మైనార్టీలు ఉద్యోగాల్లో, నామినేటెడ్ పోస్టుల్లో కనిపిస్తున్నారు. 50 శాతం చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించినది  ఎవరంటే మీ జగన్. 

డీసెంట్రలైజేషన్ కోసం 13 జిల్లాలను 26 జిల్లాలను చేసాం.4 సీ పోర్టులు తీసుకువచ్చాం. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండ్ సెంటర్లు అంటే మీ జగన్‌. ఎయిర్ పోర్టుల విస్తరణ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వాయువేగంతో పనులు జరుగుతున్నాయంటే కూడా మీ జగన్‌. మూడు ఇండిస్ట్రియల్‌  కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయంటే మీ జగన్‌. ప్రణాళిక ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినది మీ జగన్. అందులో ఒకటి మచిలీపట్నం సీపోర్టు వేగంగా అడుగులు పడుతున్నాయి అంటే మీ జగనే.

మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది.
మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది... వారి జెండా.. మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కిందపడుతోంది. మరి ఇంటింటి అబివృద్ధి కొనసాగాలా.. వద్దా. 

అభివృద్ధి  కొనసాగాలంటే ఫ్యానుకు ఓటేయాలి
కొనసాగిలాంటే ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరి పాలనలో మంచి జరిగింది ఎవరు సీఎంగా ఉంటే మన జీవితాలు వెలుగును చూస్తాయన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అబివృద్ధి కొనసాగుతుంది. ఇంటింటికి వెళ్లినపుడు చంద్రబాబు చేసిన మోసాలను కూడా వివరించాలి. గతంలో ఏం చెప్పారు..  ఏం చేసినదీ వివరించాలి.

మొట్టమొదటిసారిగా ఎం ఎస్ ఎం ఈ లకు తోడుగా ఉంటూ వారిని చేయి పట్టి నడిపిస్తూ ప్రోత్సాహం ఇస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్. 
వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ప్రతి సంవత్సరం వస్తున్నామంటే కారణం మీ జగన్. 

మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా .... గతంలో మేనిఫెస్టో అంటే రంగురంగులు కాగితాలు ఇచ్చేవాళ్ళు. ఎన్నికల అప్పుడు రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు. టీవీల్లో ఊదర కొడుతూ అడ్వర్టైజ్‌మెంట్లు వచ్చేవి. ఎన్నికల అయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలోకి పోయేది.  పేదలందరూ కూడా మోసపోయి అన్యాయం పాలు అవుతున్న చరిత్రను ఒక్కసారి తిరగరాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 58 నెలల్లో మొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత  గా, బైబిల్ గా, ఖురానుగా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా 99 శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి, ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి, మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉంటే, మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలిరండి అని చెప్పి.. మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, నిజాయితీగా ఈ వ్యవస్ధలోకి మార్పు తీసుకుని వచ్చి చెప్పగలుగుతున్నాడు. 

కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతూ ఉంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడుతోంది. 
మరి ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? కాపాడుకోవాలా? వద్దా? ఈ 
ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలంటే  ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను , ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీ ప్రతి ఇంట, మీరు ప్రతి ఒక్కరూ చర్చించుకోండి.
ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాలు వెలుగులు చూస్తాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుతున్నాను. 

ఫ్యానుకు రెండు ఓట్లు
ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుంది అని స్టార్ క్యాంపైనర్లుగా ప్రతి ఒక్కరికి చెప్పమని కోరుతున్నాను. 

చంద్రబాబు చేసిన మోసాలనూ వివరించండి.
అదే విధంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను కూడా ప్రతి ఒక్కరికి వివరించాలి.
ఈ చంద్రబాబు కూటమి ఏమిటి, గతంలో వాళ్ళు ఏం చెప్పారు?, వాళ్లంతా ఏం చేశారు అన్నది వివరించాలా లేదా? 

గతంలో 2014లో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆయన సంతకంతో ఇదే మాదిరిగా 2014లో ముఖ్యమైన హామీలంటూ.. చంద్రబాబు, దత్త పుత్రుడు, పక్కనే మోడీ గారి ఫోటో తో తయారుచేసి మేనిఫెస్టో కాపీని సంతకం పెట్టు మరి చంద్రబాబు ఇంటింటికి పంపించాడు. ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలోనూ, టీవీల్లోనూ పేపర్లలోనూ అడ్వర్టైజ్మెంట్లను అదరగొట్టారు. 

చంద్రబాబు విఫల హామీలు
ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతీ ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో ఏముంది అంటే...
రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా? 

చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తా అన్నాడు. మరి రూ. 14, 205 కోట్ల రూపాయలో ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? 

మూడో హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్  లలో రూ.25000 డిపాజిట్ చేస్తా అన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా? 

చంద్రబాబు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల్లో నెలకు రూ. 2000 చొప్పున ఒక్కో ఇంటికి రూ. 1,20,000 ఇచ్చాడా? 

అర్హులైన వాళ్లందరికీ మూడు సెంట్లు స్థలం 
కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా..?

పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా?.
ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చంద్రబాబు పూర్తి చేశాడా?
ఉమెన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేేశాడా? సింగపూర్‌కి మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, మీ గుడివాడలో కనిపిస్తుందా? ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతున్నాను.

ప్రత్యేక హోదా తెచ్చాడా?
ప్రత్యేక హోదా ఇవ్వకపోగా తిరిగి ఇదే కూటమి మళ్లీ ఇదే ముగ్గురు.... ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారు... ఇదే కూటమి మళ్లీ వీళ్ళే ఏమంటున్నారు. ఈరోజు మళ్లీ కొత్త మేనిఫెస్టో అట.. మళ్లీ కొత్త మోసాలట... సూపర్ సిక్స్ అట... సూపర్ సెవెన్ అట... ఇంటింటికి కేజీ బంగారమట, ఇంటింటికి బెంజికారట.. నమ్ముతారా..?

పేదల భవిష్యత్‌ను కాపాడుకునేందుకు మీరు సిద్ధమా?
మరి ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా...?

సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. అందులో లైట్ బటన్ ఆన్ చేయండి. పేదల భవిష్యత్తు కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. 

వాలంటీర్లు మళ్ళా ఇంటికే రావాలన్నా...
పేదవాడి భవిష్యత్తు మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా...లంచాలు వివక్షాలేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా... మన వ్యవసాయం మన హాస్పిటల్ లు మెరుగుపడాలన్నా... ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175 కు  175 అసెంబ్లీ స్థానాలు.. 25 కు 25 ఎంపీ స్థానాలు..
ఒక్కటి కూడా తగ్గేందుకే వీల్లేదు.. సిద్ధమేనా?

మన అభ్యర్ధులను ఆశీర్వదించండి.

  • ఈరోజు మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సుల మధ్య మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్థులను మీకు పరిచయం చేస్తున్నాను. మీ చల్లని దీవెనలతో మీ బిడ్డను ఆశీర్వదించండి అభ్యర్థులను ఆశీర్వదించండి. మరో రెండు నెలలు తిరగక మునుపే మీ బిడ్డ జగన్ అనే నేను మళ్లీ మీ ముందుకు వస్తాను. 
  • దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో... ఇంతకుముందు కన్నా కూడా ఇంకా ఎక్కువగా మంచి జరిగే కార్యక్రమం దేవుడి దయతో చేయగలుగుతాను అని సవినయంగా మనవి చేస్తున్నాను. 
  • డాక్టర్ గా చంద్రశేఖర్ అన్న మీ అందరికీ పరిచయమే. సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి కేన్సర్ డాక్టర్ గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు. ఎంపీ అభ్యర్థిగా ఆయన నిలబడుతున్నారు. మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. 
  • మచిలీపట్నం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ల నాన్న నాకు మంచి స్నేహితుడు, కిట్టు నిలబడుతున్నాడు. మంచి చేస్తాడు అన్న విశ్వాసం నమ్మకం సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కిట్టు పై ఉంచాలని సవినయంగా కోరుతున్నాను. 
  • పెడన నుంచి రాము నిలబడుతున్నాడు. మంచివాడు, సౌమ్యుడు, యువకుడు ఉత్సాహవంతుడు, ఇంజనీర్ కూడా... మీ చల్లని దీవెనలు  రాముపై కూడా ఉంచవలసిన ప్రార్థిస్తున్నాను. 
  • పామర్రు నుంచి అనిల్ నిలబడుతున్నారు. గుణగణాలలో అనిల్ కి ఎవరు సాటిలేరు. అంత మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు అనిల్ పై ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 
  • గన్నవరం నుంచి వంశీ నిలబడుతున్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి... మంచివాడు సౌమ్యుడు , నాకు మంచి స్నేహితుడు కూడా. ప్రజలకు మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాను. 
  • గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు.. నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. నేనే దగ్గరుండి  నానీతో మంచి చేయిస్తాను కూడా.. మీ చల్లని దీవెనలను నానిపై ఉంచాల్సిందిగా సవినయంగా కోరుతూ ప్రార్ధిస్తున్నాను. 
  • అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అన్న నిలబడుతున్నాడు. తాను కూడా మంచివాడు సౌమ్యుడు. మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు రమేష్ అన్న పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 
  • పెనమలూరు నుంచి జోగి నిలబడుతున్నాడు. జోగి కూడా నాకు స్నేహితులు మంచివాడు సౌమ్యుడు. మీ అందరూ చల్లని దీవెనలు జోగిపై ఉంచాల్సిందిగా సవనియంగా ప్రార్థిస్తున్నాను.
  • మన గుర్తు ఫ్యాను. అక్కడో.. ఇక్కడో.. ఎక్కడైనా మన గుర్తు తెలియకపోయినా, మర్చిపోయినా.. మన గుర్తు  ఫ్యాన్‌ అని గుర్తుంచుకొండి.  మంచి చేసిన ఫ్యాన్ ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి... తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి...అందరూ గుర్తుంచుకోమని కోరుతున్నాను. అలా వచ్చి మీకు కనపడి మరలా వెనక్కి వస్తాను అని చెబుతూ..  సీఎం శ్రీ వైయస్‌.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
Back to Top