ఆప్కోను ఆదుకున్న మనసున్న నేత సీఎం వైయ‌స్ జగన్

చంద్రబాబు నేతలన్నను పట్టించుకోలేదు: చేనేత కార్మికులు

చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి

 
 మంగ‌ళ‌గిరి: ఆప్కోను ఆదుకున్న మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని చేనేత కార్మికులు కొనియాడారు.  ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం వైయ‌స్ జగన్‌ చేనేత రంగాన్ని ఆదుకున్నార‌ని చెప్పారు. మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా శ‌నివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు చేనేత కార్మికులు మాట్లాడారు.

1.చేనేత మహిళ..

నాకు చేయూత వస్తోంది. నా సొంత మగ్గంతో నా సొంతింటిలోనే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నాను. నాకు మగ్గం డబ్బులు కూడా వచ్చాయి.  

2.    గుండు కమల, మంగళగిరి:

నాకు మగ్గం షెడ్డులో ఇచ్చారు. నేతన్న నేస్తం కూడా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు.

3.    పి. శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు
యావత్ చేనేత కుటుంబాలు సీఎం జగన్ కు రుణపడి ఉంటాయి. రేపు జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి.. సహకార సంఘాలు, కార్మికులు, పవర్ లూమ్స్ విషయంలో గానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చేనేతల పిల్లలు ఈరోజు టోఫెల్ అంటే.. 4 లక్షల మంది జగన్ లు తయారవుతారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ ప్రజానీకానికి తెలిస్తే 2030 వరకు ఉన్న విజన్ ను గుర్తించాలి. చేనేత బ్యాంక్ ను ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను.     

4.    కవుతరపు రాఘవమ్మ, చేనేత మహిళ..

నాకు రాజీవ్ గృహకల్పలో ఇళ్లు వచ్చింది నాన్నగారి టైమ్ లో. 2009 నుంచి అక్కడే ఉంటున్నాం ఆ చిన్న ఇంట్లోనే మగ్గం పెట్టుకుని. నేతన్న నేస్తం వస్తోంది, పింఛన్ కూడా వస్తోంది బాగానే ఉంది మాకు.  

5.    విజయలక్ష్మి, మంగళగిరి..

నమస్తే జగనన్న మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకు ఉదయాన్నే ఇంటివద్దనే పిలిచి పెన్షన్లు ఇవ్వడం చాలా బాగుంది. ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఎక్కడికి వెళ్లాలి? ఏంటి? అని గంటల తరబడి క్యూలో నిల్చున్న తర్వాత కూడా సరైన సమాధానం వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటీర్లు ఇంటికే వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటివద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని తీర్చే ఈ వాలంటీర్ల వ్యవస్థ మాకు నచ్చింది. చాలామంది చదువుకోవడానికి అమ్మఒడి, విద్యాదీవెన ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీనాలీ చేసుకునే ప్రతిఒక్కరు కూడా తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షలు ఇవ్వడం వల్ల చాలామంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా చాలా మేలు కలుగుతోంది. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. ఆయన చెప్పిన నవరత్నాలన్నీ కూడా అమలు పరిచిన సీఎం కాబట్టి మళ్లీ జగనన్నే రావాలి, మనమందరం కూడా జగనన్నకే ఓటు వేయాలి. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు గానీ చేసింది లేదు. జగనన్న వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. మా పిల్లలకు అమ్మఒడి వస్తోంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు అన్నవాళ్లు ఎవరూ లేరు. రాలేదు అని చెబుతున్నారంటే వాళ్లు కావాలని చెబుతున్నట్టే. కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పథకాలు వచ్చాయి.     

6.    శ్రీనివాసరావు, మంగళగిరి
ప్రాణదాత, విద్యాదాత రాజశేఖర్ రెడ్డి గారైతే మరో విద్యాదాత మా జగనన్న. చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రూ.81 కోట్ల గ్రాంట్ కూడా వస్తే ట్రెజరీలో ఉంటే ఆ డబ్బులను చేనేతలకు ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు. తమరు వచ్చిన తర్వాత దేశంలోనే చేనేతలకు ప్రప్రథమంగా రూ.24 వేలను నేతన్న నేస్తంగా ప్రకటించారు. రూ.3 వేల పెన్షన్ లెక్క ఇస్తూ సుమారు రూ.1000 కోట్లను చేనేత కార్మికులకు ఇస్తున్నారు. ఆప్కోకు కూడా రూ.108 కోట్ల బకాయిలను చెల్లించి చేనేత కార్మికుల జీవితాలు బాగు చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం..   

7.    హేమలత, మంగళగిరి

నాకు ఇద్దరు ఆడపిల్లలకు జగనన్న. పిల్లలకు అమ్మఒడి, విద్యాదీవెన వస్తోంది. నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. జగనన్న ప్రభుత్వంలో పేదవాళ్లకు ఇంటి స్థలం వస్తోందని వాలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పి మరీ నాకు ఇంటి స్థలం ఇప్పించారు. కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి అన్యాయం చేశారు. చంద్రబాబు ఇలా చేయడం కరెక్ట్ కాదు. జగనన్న మళ్లీ మీరే రావాలి, మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరే మా నమ్మకం. 

సీఎం జగన్...

మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక ఆర్నెళ్లు చూస్తాడు, దాని తర్వాత అవసరమైతే మళ్లీ కొత్త స్థలాలు కొని ఇచ్చైనాసరే వీళ్లందరికీ కూడా అక్కడే ఇచ్చే కార్యక్రమం చేస్తాను కచ్చితంగా చేస్తామని చెబుతున్నాను.    

8.    మేరీ పాల్ పద్మావతి దేవి, హరిజన క్రైస్తవ, వెనుకబడిన తరగతుల సేవాసంఘం అధ్యక్షురాలు:

నేను యూట్యూబ్ లో చూశాను. లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేం చెప్పినవాళ్లకే పథకాలు, ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తామని చెప్పడం నేను విన్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే సీఎం కావాలా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా? అని మనమందరం ఆలోచించుకోవాలి.

నందం దుర్గ, చేనేత మహిళ
చేనేతలకు షెడ్లు వేయించారు

జగనన్నా మా చేనేతలకు షెడ్లు వేసారు, చేయూత వస్తోంది. మావారికి పెన్షన్ వస్తోంది. నేతన్న నేస్తం రాలేదు. ఇప్పుడు ఇప్పిస్తాం అని ఆళ్లరామకృష్ణా రెడ్డి అన్న అన్నారు. 
సీఎం వైఎస్ జగన్
నేతన్న నేస్తం, లేదా చేయూత ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది తల్లీ. 

పుబ్బా హనుమంతరావు, చేనేత కార్మికుడు
చేనేతకు మేలు చేసిన జగనన్నే మళ్లీ రావాలి

గత ప్రభుత్వంలో నాకు పింఛన్ లేదు. జగనన్న వచ్చాక నాకు పెన్షన్ వస్తోంది. నా భార్యకు 45 ఏళ్ల మహిళలకు ఇచ్చే రూ.18,750 చేయూత వచ్చింది. నా మనవడికి అమ్మ ఒడి వస్తోంది. మాకు ఇంత మేలు చేసిన జగనే మళ్లీ రావాలి. మంగళగిరిలో లావణ్య గొప్ప మెజారిటీతో గెలవాలి. 

కొండేటి కుమారి, చేనేత మహిళ, రత్నాలచెరువు, మంగళగిరి
మీరే సాయం చేస్తారని నమ్ముతున్నాం

మా ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. మన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కదా. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న మా అన్ని ప్రాంతాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. మాకు ఇళ్ల పట్టాలు రావాలి. చేనేత కార్మికులకు 100 యూనిట్లు ఉచితంగా విద్యుత్ కావాలని అడిగాము. దాన్ని మీరు అమలు చేస్తే మాకు ఎంతో మేలు చేసినవారు అవుతారని కోరుతున్నాం జగనన్నా. మీరు మాత్రమే మాకు మేలు చేస్తారని నమ్ముతున్నాం. మా రత్నాల చెరువు ప్రాంతంలో చాలామంది అద్దె మగ్గాలతో నేసుకుంటున్నారు. వారికి కూడా సాయం చేయాలని కోరుతున్నాను.

సీఎం వైఎస్ జగన్ 
54 వేల పట్టాలు మనం పేదలకోసం మంగళగిరి నియోజకవర్గంలో లే అవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమం చేస్తే...ఏం జరిగింది అంటే - 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే...జగన్ ఎక్కడ ఇన్ని వేల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చేస్తాడో, అవి తీసుకున్న అక్కచెల్లెమ్మలు జగన్‌ను ఎక్కడ గుండెల్లో పెట్టేసుకుంటారో అని చంద్రబాబు, లోకేష్ కోర్టుకు వెళ్లి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కేసు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసారు. 

మీ బిడ్డ దాన్ని సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ పోరాటం చేసాడు. సుప్రీం కోర్టు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అప్పుడు మేం ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్లు కూడా సాంక్షన్ కూడా చేయించాం. కట్టడం మొదలు పెట్టే సమయానికి మళ్లీ చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లి ఇలాగే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని కేసు వేసాడు. దాంతో సుప్రీం మేటర్ హియరింగ్ కోసం పోస్ట్ పోన్ చేస్తోంది. 

మనం అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఒక్కోఇంటి స్థలం విలువ 5 లక్షల నుండి 7 లక్షలు. ఆ ఇల్లు కడితే దాని ఖర్చు రూ.2,40,00, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో లక్ష రూపాయిలు. అంటే ఒక్కో ఇంటి విలువ కనీసం 10 నుండి 15 లక్షలు. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో 10-15 లక్షలు విలువ చేసే ఆస్తిని పెడుతుంటే అడ్డుకున్నది చంద్రబాబు, లోకేష్‌లే. వాళ్లు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే మీరు అందరూ ఇదే మాట అడగాలి. 54 వేల మందికీ జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే నువ్వెందుకు అడ్డుకున్నావ్..బుద్ధీ జ్ఞానం ఉందా అని అడగాలి. 

రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే - జగన్‌ చేయొచ్చు, ఇంకొకరు చేయొచ్చు..బాగుపడేది పేదవాడు అయినప్పుడు అడ్డు పడాలని చూసిన ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలకు అనర్హుడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 

అబద్ధాలు ఆడటం తప్పు. మోసం చేయడం ధర్మం కాదు. మన ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో క్లియర్‌ గా మేనిఫెస్టోలో చెబుతాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశమూ కూడా 99% , చంద్రబాబులా 2% కాదు 99% హామీలు నెరవేర్చి మళ్లీ మీ ఆశీస్సులు కోరుతూ మీ వద్దకు వస్తున్నాం. మగ్గానికి సంబంధించి మీరు చెబుతున్నది విన్నాను. అద్దె మగ్గాల వారికి కూడా ఇవ్వాలనే ఉంది. కానీ అలా చేయగలుగుతామా? ఎవరు అద్దె మగ్గాన్ని ఎవరు వాడుతారో ఎలా చెప్పగలుగుతాం. ఇవాళ ఒకరు రేపు ఇంకొకరు వాడతారు. దీనివల్ల అధికారపార్టీకి దగ్గరగా ఉన్న వారు దాన్ని ఉపయోగించుకుంటారు. మనం ఏం చేసినా పారదర్శకంగా ఉండాలి. అందుకే మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ, వారు ఏ పార్టీ వారైనా సరే ఇచ్చాం. మీ ఇంట్లో మగ్గం ఉండి పథకం అందలేదు అంటే సచివాలయ వ్యవస్థది తప్పు, వాలంటీర్ వ్యవస్థది తప్పు, ఈ వ్యవస్థలన్నీ నడుపుతున్న మీ బిడ్డది తప్పు.  వాటి విషయంలో మీ బిడ్డ అకౌంటబులిటీ తీసుకుంటాడు. అలాంటి తప్పులు జరిగితే రిపేర్ చేసే కార్యక్రమం కూడా చేస్తాడు. కానీ అద్దె మగ్గాల విషయంలోకి వెళితే ప్రతి నెలా 2వేలు డబ్బులు ఇవ్వడం ద్వారా వారు మగ్గం పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం. త్వరలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు కూడా సాంక్షన్ చేస్తాం.

 

 

Back to Top