చంద్రబాబు భూములు లాక్కుంటే.. జగన్ భూములు ఇచ్చాడు. ఇక దుర్మార్గాలేంటి? మీ దస్తావేజులు మీకే ఇస్తారు. ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారు.
వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.
ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు.
అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది.
ఈ ఘటనను నేను ఖండిస్తా.. మీరు, మన మీడియా, సోషల్ మీడియా బృందాలు మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించాలి’ అని టీడీపీ పరివారానికి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటల నుంచి వారంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు