తాడేపల్లి: మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి , వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్టు చేశారు. `దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు దామోదరం సంజీవయ్యగారు. పాలనలో కూడా తనదైన ముద్రవేసి.. ప్రజల హృదయాల్లో నిలిచి పోయారు. నేడు దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు` అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.