తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.