వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ కమిటీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పెద్దిరెడ్డి, చెవిరెడ్డిని సింగపూర్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.