172వ రోజుకు చేరిన యాత్ర

రాజానగరం, 07 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 172వ రోజుకు చేరుకుంది. గురువారం నాడు రాజానగరం మండలం పరిజెల్లిపేటలో ఆమె రాత్రి బస చేసిన సంగతి తెలిసిందే. ఆమె అక్కడి నుంచి శుక్రవారం ఉదయం యాత్ర ప్రారంభించారు.  అక్కడ నుంచి కానవరం, తొకడ, మల్లంపూడి మీదుగా యాత్ర చేస్తారు. తొకడలో షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తారు. ఇవాళ 13.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

Back to Top