నెల్లూరు))జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...నెల్లూరు నగర బైపాస్ జంక్షన్ లు మరణ జోన్ లుగా మారాయని అన్నారు. బుజబుజ నెల్లూరు, గొలగమూడికి వెళ్లే రహదారులు కసుపర్తిపాడు క్రాస్, చిల్డ్రన్స్ పార్కు, ఎన్ టీఆర్ నగర్, రాజుపాళెం జంక్షన్ల వద్ద బ్రిడ్జీలు, నగర బైపాస్ రోడ్లు అధ్నాన్నంగా మారాయన్నారు. వీటికోసం 3 నెలలుగా ప్రయత్నిస్తే నేడు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. వీటిని మంజూరు చేయడానికి కలెక్టర్ కృషి చేయాలని కోరారు. <br/>అదేవిధంగా నారాయణరెడ్డి పేట చేనేత కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వారికి పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వలేదని చెప్పారు. చేనేత కాలనీల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రూరల్ నియోజకవర్గంలోని శ్మశానవాటికల్లో కనీస వసతుల కల్పనకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. క్రిస్టియన్ శ్మశానాల ఏర్పాటుకు స్థలం కేటాయించడంతో పాటు వాటి అబివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరు నగరానికి ప్రజలు భారీగా వలస వస్తున్నందున నెల్లూరు రూరల్ ప్రాంతానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అభిృవృద్ధి పర్చేందుకు కలెక్టర్ దత్తత తీసుకోవాలని కోరారు.