చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే ధర్నా

చిత్తూరు: ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వైయస్సార్‌ సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులను కలవని కలెక్టర్‌ ను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కపక్క సామాన్యులు కష్టాలు పడుతుంటే.. చెప్పాపెట్టకుండా కలెక్టర్‌ సెలవుపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల నల్లధనాన్ని మార్చడానికే కలెక్టర్ 17 రోజుల పాటు సెలవు పెట్టి  వెళ్లారని ఆరోపించారు.

Back to Top