వైయస్ఆర్ కడప: వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి పులివెందుల చేరుకున్న ఆయన నేటి ఉదయం వేంపల్లి మండలం నందిపల్లిలో పర్యటించారు. మాజీ సర్పంచ్ ఓబులేసురెడ్డి సోమవారం మృతి చెందగా ఆయన కుటుంబీకులను పరామర్శించారు. ఓబులేసురెడ్డి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతి చెందారు. అదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను కూడా వైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను, స్థానిక నేతలను కలిశారు. బుధవారం కూడా జిల్లాలో వైయస్ జగన్ పర్యటించనున్నారు.