<p class="rtejustify" style="" margin-top:0in=""><strong>న్యూఢిల్లీ : </strong>ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగున్నరేళ్లుగా పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు, నిరసనలు, పదవులకు రాజీనామాలు వంటి వాటితో అనేకరకాలుగా పోరాటాలు చేస్తున్నామని, అయినా ఇంకా మనల్నే విమర్శిస్తున్నారని ఇది వారి సంకుచిత ధోరణికి నిదర్శనమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి తాను మాత్రమే పోరాటం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న చంద్రబాబు,గతంలో హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని హోదా ఉన్న రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందాయని ప్రశ్నించిన విషయాన్ని మరచిపోయారన్నారు. హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవంటూ, ప్యాకేజి తీసుకున్న వ్యక్తి యూటర్నులు తీసుకున్నారని ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ది లేదని, కేవలం , నవనిర్మాణ దీక్ష లంటూ కాంగ్రెస్ విమర్శిస్తారు. ధర్మపోరాటాలంటూ మోడీని విమర్శిస్తారని ఇటువంటి వారిని చూస్తే రాజకీయాలంటే అసహ్యం వేస్తోందన్నారు. వినేవాడుంటే ఏమైనా చెపుతారన్నారు. పోలవరం ప్రాజెక్టు అంతా తన ఘనత అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఆ ప్రాజెక్టు కు సంబంధించిన అన్ని అనుమతులను సాధించి పనులను చేపట్టిన ఘనత మహానేత వైయస్ఆర్ దే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ రోజు రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు చూసినా అందులో రాజశేఖరరెడ్డిగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి అయిన వాటి అంచనాలు పెంచి, చంద్రబాబు ముడుపులు దండుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నయవంచకుడిని ఎంతమాత్రం క్షమించకూడదని పిలుపునిచ్చారు. <p class="rtejustify" style="" margin-top:0in=""><strong/></p></p>