సొంత మనుషులకు బాబు అప్పనంగా భూ సంతర్పణశ్మశానాలు కూడా ఆక్రమిస్తున్న టీడీపీ నాయకులురెండున్నరేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా, ఒక్క పరిశ్రమైనా తెచ్చావా బాబూ..?వైయస్ జగన్ ను సీఎం చేస్తేనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందివైయస్సార్సీపీ నేతలు దాడిశెట్టి రాజా, సునీల్దానవాయిపేట: చంద్రబాబు పేద ప్రజల్లో దివీస్ మంట రగిలిస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. దివీస్ మాకొద్దు బాబోయ్ అని ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెళ్లిళ్లు, పేరాంటాలు, బర్త్‌డే ఫంక్షన్లు జరుగకుండా హింసిస్తున్నారు. ఇక్కడ ఉన్న 670 ఎకరాల భూములు ఇవ్వమన్న ప్రజలను ప్రభుత్వం నానారకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దానవాయిపేట పంచాయతీలో ఎకరం కోటి రూపాయలు విలువ చేసే భూమిని అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని కాపాడుకుంటున్నారు. టీడీపీ నాయకులు శ్మాశానాన్ని కూడా ఆక్రమించారని ఆగ్రహించారు . అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా, భూములు ఇవ్వమన్న అమాయకప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత 85 రోజులుగా ఈ ప్రాంతవాసులు పోరాటం చేస్తున్నారు. వారికి వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. చంద్రబాబు తన సొంత మనుషులకు కట్టబెట్టేందుకు పేదలపై జులూం ప్రదర్శిస్తున్నారు. పేదల పక్షాన పోరాటం చేస్తుంటే అభివృద్ధికి వైయస్‌ఆర్‌సీపీ అడ్డుపడుతుందని అబాండాలు వేస్తున్నారని రాజా మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక నీవు ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా, ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా..? అని బాబుపై నిప్పులు చెరిగారు. తుని ఎమ్మెల్యే తోక కోస్తామని చంద్రబాబు అన్నారట. బాబు..మీ స్థాయికి తగ్గ మాటలు కావు. మీరు..మీ ఎమ్మెల్యే కలిసి ఓ ఎమ్మెల్యేను నడిరోడ్డుపై హత్య చేశారు. ఇప్పుడు నన్ను హెచ్చరిస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. 600 కోట్లు విలువ చేసే భూములు కేవలం రూ.40 కోట్లకే మీ వాళ్లకు కట్టబెట్టడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
ఏపీలో ప్రజాస్వామ్యం లేదుచలమలశెట్టి సునీల్ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, ఆర్థిక వ్యవస్థ అతులాకుతలం అయ్యిందని చలమలశెట్టి సునీల్ అన్నారు. దివీస్ పరిశ్రమ యాజమాన్యానికి మేలు చేసేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని బాబుపై ధ్వజమెత్తారు. వ్యవస్థను అతులాకుతలం చేసేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు వైయస్ జగన్ అండగా నిలిచారని తెలిపారు. ఇవాళ చంద్రబాబు ప్రతి వర్గాన్ని అణచివేస్తున్నారు. హోదా కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై కేసులు పెడుతున్నారని సునీల్ మండిపడ్డారు. దివీస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆంక్షలు విధించడం రాచరిక పాలనకు నిదర్శనమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్ 30, 144 అమలులో ఉండటం బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం ఎలాంటి నాయకుల పాలనలో ఉన్నామో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్ జగన్ సీఎం కావాల్సిందేనని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని చలమలశెట్టి సునీల్ అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో రకాల హామీలు ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్నారు. వైయస్ జగన్‌ను సీఎం చేస్తేనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.