పోటీలు పడి హామీలిచ్చారు...ఆచరణలో విస్మరించారు

ఢిల్లీ:  నాలుగున్నరేళ్ల క్రితం
మోడీ, బాబు ఎన్నికల్లో ఓట్లకోసం పోటీలు పడి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని
మంగళగిరి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రత్యేక ప్యాకేజి కోసం హోదాను చంద్రబాబు
తాకట్టు పెట్టారన్నారు. శాసనసభలో హోదా కోసం తీర్మానాలు చేసినా, చంద్రబాబు వైఖరి
వల్ల అవి నామమాత్రంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రిని మోడీని
విమర్శించడానికి కూడా జంకుతున్న పరిస్థితుల్లో కూడా వైయస్ఆర్ పార్టీ ఆయనపై అవిశ్వాస
తీర్మానం ఇచ్చిన తన నిజాయితీని నిరూపించుకుందన్నారు. హోదా వచ్చేంతవరకు తాము పోరాడుతూనే
ఉంటామని ఆయన ప్రకటించారు.

అబద్దాల పుట్ట చంద్రబాబు-
ఎమ్మెల్యే ముస్తఫా

ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్
మోహన్ రెడ్డి నేతృత్వంలో నిరంతరం పోరాడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజి
కోసం ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని అబద్దాలు ఆడి ప్రజలను వంచించారని ఎమ్మెల్యే
ముస్తఫా విమర్శించారు. అబద్దాల పుట్టను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు వైయస్ఆర్
పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

ప్రత్యేక హోదా మనకు వచ్చి ఉంటే
దాదాపు 5 లక్షలకోట్ల మేర ప్రయోజనం జరిగేదని దానిని కచంద్రబాబు కాలరాశారని సీనియర్ నేత
ధనుంజయ రెడ్డి విమర్శించారు.ఇందుకు ప్రజలకు చంద్రబాబుకు గుణపాఠం చెపుతారని ఆయన
ప్రకటించారు.

తాడికొండ నియోజకవర్గ సమన్వయ
కర్త ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ  తన
గుడ్లను తానే పాము లాంటి చంద్రబాబు అన్నిటిని స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని,అమరావతి ఒక భ్రమరావతే అని బాబు ప్రచారం తప్ప
మరోటి లేదన్నారు. రైతుల కడగండ్లు అన్నీ ఇన్నీ కావన్నారు. బాబు భూ దాహం తీరటం
లేదని, ఇసుక, మట్టిని కూడా సిండికేట్లుగా మారి దోచుకుంటున్నారని, ఇటువంటి
అన్యాయమైన ప్రభుత్వాన్ని ఇంకా భరించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. ప్రత్యేక
హోదా పై పూటకో మాట మారుస్తూ ప్రజలను వంచిస్తున్నారని బాబు తీరుపై మండిపడ్డారు. 

Back to Top