నేటి ‘మరో ప్రజాప్రస్థానం’ 13.9 కిలోమీటర్లు

కాకినాడ, 16 జూన్‌ 2013:

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం 181వ రోజు వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు. పిఠాపురం నుంచి ఆదివారం ఉదయం‌ శ్రీమతి షర్మిల పాద యాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కుమారపురం, కొత్త కందరాడ, జల్లూరు వరకూ 5.7 కిలోమీటర్ల నడుస్తారు. జల్లూరు సమీపంలో మధ్యాహ్న భోజనానికి శ్రీమతి షర్మిల ఆగుతారు.

భోజన విరామం అనంతరం కోదండరామపురం, బ్రౌన్ జంక్షన్ మీదుగా సామర్లకోట‌ వరకూ 8.2 కిలోమీటర్ల మేర పాదయాత్రను శ్రీమతి షర్మిల కొనసాగిస్తారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌ సమీపంలో నిర్వహించే బహిరంగసభలో ఆమె వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశంచి ప్రసంగిస్తారు. ఆదివారం రాత్రికి సామర్లకోటలోనే శ్రీమతి షర్మిల బస చేస్తారు. ఆదివారం మొత్తం 13.9 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుందని రఘురాం, చిట్టబ్బాయి తెలిపారు.

Back to Top