ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన దీక్ష విజయవంతం..


కేంద్రం ప్రభుత్వం మెడలు వంచుదాం..
ప్రత్యేకహోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం..
చివరి పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం దిగిరావాలి..
వైయస్‌ఆర్‌సీపీ నేతలు  డిమాండ్‌..

ఢిల్లీః ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు  ఏపీ ప్రజలకు చేసిన వంచనకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టి వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమం విజయవంతం అయ్యింది.వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీక్ష కార్యక్రమానికి  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు అధ్యక్షత వహించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు గళం విప్పి గర్జించారు. 16వ లోక్‌సభకు ప్రస్తుతం జరుగుతున్న చివరి పూర్తిస్థాయి పార్లమెంట్‌ సమావేశాల్లో అయినా కేంద్రం దిగి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదాకు ఇవ్వాలని నేతలు డిమాండ్‌ చేశారు.దేశంలో మోదీ గ్రాఫ్‌ తగ్గిపోవడంతో చంద్రబాబు బీజేపీ నుంచి తెగతెంపులు చేసుకున్నారని,ధర్మపోరాట దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్,అవినాష్‌ రెడ్డి, మిథున్‌రెడ్డి,మల్లాది విష్ణు,కోరుముట్ట శ్రీనివాసులు, జంగా కృష్ణమూర్తి,మార్గాని భరత్,భూమన కరుణాకర్‌ రెడ్డి, కొలుసు పార్థసారధి,జోగి రమేష్,అంజాద్‌ బాషా,పృథ్వీరాజ్,పినిపే విశ్వరూప్‌.కంబాల జోగులు,కురసాల కన్నబాబు,చిర్ల జగ్గిరెడ్డి,రెహమాన్,ఆదిమూలపు సురేష్,ఇక్బాల్,ఆళ్ల రామకృష్ణారెడ్డి,బివై రామయ్య,కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు.
Back to Top