<strong>ఢిల్లీః</strong> విభజన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా మోదీ,చంద్రబాబులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వంచించారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా అన్నారు.రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలు వల్లన ఏపీ తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు.రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికి ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుందన్నారు.నాలుగున్నరేళ్ల తర్వాత ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన అని చెప్పి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే ఒక వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందన్నారు.మన రాష్ట్రం కోసం ఏ నాయకుడి అయితే చిత్తశుద్ధితో పోరాటాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు.