ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి..వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..
ఢిల్లీః ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై గత నాలుగున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను టీడీపీ,బీజేపీలు వంచించాయన్నారు. 2014 ఎన్నికల సమయంలో భాగస్వాములుగా ఉన్న మోదీ,చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రత్యేకహోదాను ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని ప్రజల చేత ఓట్లు వేయించుని నట్టేట ముంచారని మండిపడ్డారు.ప్రత్యేకహోదా కోసం రాష్టవ్యాప్తంగా నాలుగు సార్లు వైయస్‌ఆర్‌సీపీ బంద్ చేపట్టిందన్నారు. ప్రత్యేకహోదాతోనే అభివృద్ధి చెందుతుందని, విభజన హామీలు అమలు జరిగితే పురోగతి సాధిస్తుందన్నారు.ప్రత్యేకహోదా అవశ్యకతను తెలుసుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. జరగబోయే చివరి బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలను కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై దేశవ్యాప్తంగా తెలియజేయడానికి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టిన ఘనత వైయస్‌ఆర్‌సీపీదేనని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ 13 సార్లు అవిశ్వాస తీర్మాణం పెట్టిందని, అవిశ్వాస తీర్మానాలను చర్చకు రాకుండా ఎన్డీయే ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఏపీ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు కూడా చేశామన్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాలేదన్నారు. చివరి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రత్యేకహోదాపై స్పష్టత ఇవ్వాలని కోరారు