ప్రత్యేకహోదాపై వైయస్‌ఆర్‌సీపీ చిత్తశుద్ధితో పోరాడుతుంది.


వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు..
వైయస్‌ఆర్‌సీపీ నేతలు 

ఢిల్లీః ప్రత్యేకహోదా సాధనకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా లోపలి,బయట కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని, విభజన హామీలు అన్ని అమలు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశామన్నారు.ప్రభుత్వం దిగిరాకపోతే ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టిన  ఘనత వైయస్‌ఆర్‌సీపీదని అన్నారు.

–వచ్చేఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారుః మేకపాటి..

ప్రత్యేకహోదాపై వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు.మంగళగిరిలో వైయస్‌ జగన్‌ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారన్నారు.యువభేరి, ధర్నాలు చేశారన్నారు. ప్రత్యేకహోదా సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే అని అన్నారు.ప్రజలందరూ అర్థం చేసకున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన పాఠం చెప్పబోతున్నారని తెలిపారు.

–మిత్రపక్షంగా ఉండి ఏం సాధించారుః బొత్స సత్యనారాయణ

మిత్రపక్షాలుగా ఉండి, నాలుగున్నర సంవత్సరాలుగా కాపురం చేసి ప్రత్యేకహోదా సాధించకుండా చంద్రబాబు ఏమి చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 29 సార్లు ప్రధానిమంత్రిని కలిశానని చంద్రబాబు పదేపదే ధర్మపోరాట దీక్షల్లో చెబుతున్నారని,ప్రధాని ఇచ్చిన లేఖల్లో  ప్రత్యేకహోదా అంశంపై ఎన్నిసార్లు పొందిపర్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు
Back to Top