విజయవాడ) వైయస్సార్సీపీ విస్త్రతస్థాయి సమావేశం కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు ఇప్పటికే అక్కడకు చేరుకొన్నారు. ఉదయం 8గంటల నుంచి నాయకుల రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. అనంతరం అక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఉదయం 9.30 ని. ల నుంచి గంట పాటు పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ సమావేశం అవుతారు. అనంతరం 10.30ని. లకు విస్త్రత స్తాయి సమావేశం జరుగుతుంది. పార్టీ అనుసరిస్తున్న పోరాట మార్గాల మీద చర్చ నిర్వహిస్తారు. అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్య ఉపన్యాసం చేస్తారు.