<strong>చంద్రబాబు పచ్చి అవకాశవాది..</strong><strong>కేంద్రం పూర్తి న్యాయ విచారణ జరిపించాలి..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి</strong>న్యూఢిల్లీః ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనేది ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు గురించి తెలియని నాయకులు ఎవరూలేరని, ఆయన పచ్చి అవకాశవాది అనే సంగతి అందరికి తెలుసన్నారు. అవసరం కోసం ఎవరితోనైనా కలుస్తారని, అవసరం తిరిన తర్వాత వదిలివేస్తారన్నారు. వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై పూర్తి న్యాయ విచారణ జరిపించాలని జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, శరత్‌పవార్ తదితర నాయకులను కలిసి జరిగిన సంఘటనను వివరించినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం విచారణను నీరుగారుస్తుందన్నారు. నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్రమే న్యాయ విచారణ జరపాలని కోరారు. వైయస్‌జగన్‌ను అంతమొందించాలనే హత్యాయత్నం జరిగిందని, దేవుని దయతో వైయస్ జగన్ బయట పడ్డారన్నారు. పెద్దస్థాయిలో కుట్ర జరిగిందని, దీని వెనుక ఎవరు ఉన్నారనేది వెలికితీయాలన్నారు.<br/>