తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు(yuvatha poru) కార్యక్రమానికి యువత, విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విడుదల చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్దమయ్యారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ(ysrcp) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) పిలుపు మేరకు ఈ నెల 12న తలపెట్టిన యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు. చిత్తూరులో.. రాష్ట్రం లోని విద్యార్థులు , యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన నయవంచన ను “ యువత పోరు “ ద్వారా బుద్ధి చెప్పాలని వైయస్ఆర్‌సీపీ చిత్తూరు ఇంచార్జ్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన యువత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. తమ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు ఈ నెల 12 వ తేదీ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 12 వ తేదీ ఉదయం 9.30 గంటలకు పివికెయన్ డిగ్రీ కళాశాల వద్ద నుండి ప్రారంభమయ్యే ఈ యువత పోరు ర్యాలీ లో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు ,మహిళలు పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం తో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. విశాఖలో.. విశాఖపట్నం నగరంలోని మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మార్చి 12వ తేదీన తలపెట్టిన యువత పోరు పోస్టర్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ యువత,విద్యార్ధి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లపల్లి సుభద్ర , శాసన మండలి సభ్యులు కుంభ రవి బాబు, మాజీ శాసన సభ్యులు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు దొడ్డి కిరణ్ , పులగమ కొండ రెడ్డి , పెడాడ రమణి కుమారి , శనపల రవింద్ర భరత్ , కో ఆప్షన ఎం.డి షరీఫ్ , పార్టీ ముఖ్య నాయుకులు జిల్లా కర్ర నాగేంద్ర , నియోజకవర్గ యువజన్ విభాగం అధ్యక్షుడు మువ్వల సతోష్ కుమార్, ఇల్లుపు శ్రీనివాస్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు లెంక జ్ఞాన్ రావు (కార్తీక్), సెట్టి నిఖిల్ వర్ధన్ తదితరాలు పాల్గొన్నారు. రాజమండ్రిలో.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆవిష్కరించారు. ఈనెల 12న జిల్లా కలెక్టరేట్ వద్ద తలపెట్టిన యువత పోరును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వైయస్ఆర్‌సీపీ ఆందోళన కొనసాగుతుందని మార్గాని భరత్ హెచ్చరించారు. వైయస్ఆర్ జిల్లా.. ఈ నెల 12 న కడప నగరంలో చేపట్టనున్న యువత పోరు పోస్టర్‌ను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి , ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు యువత పోరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. మైదుకూరులో.. వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన యువత పోరు కార్యక్రమం పోస్టర్‌ను మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి విడుదల చేశారు. విద్యార్థుల పక్షాన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కదలి రావాలని రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం.. వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన జరిగే యువత పోరు పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అహుడా మాజీ ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఉర్వకొండలో.. ఈ నెల 12 న జరగబోయే వైయస్ఆర్‌సీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ “యువత పోరు”పోస్టర్ ఉరవకొండ మాజీ శాసనసభ్యులు వై. విశ్వేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గుంతకల్‌లో.. ఈ నెల 12 న జరగబోయే వైయస్ఆర్‌సీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం “యువత పోరు”పోస్టర్ ను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన విభాగం నాయకులతో కలిసి వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా.. ఈనెల 12వ తేదీన తలపెట్టిన యువత పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలో యువత పోరు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబన్నీసా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాష, నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విజయవాడ.. వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడ నగరంలోని జిల్లా కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. అరకులో యువత పోరు పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రేగం మత్యలింగం శ్రీ సత్యసాయి జిల్లాలో యువత పోరు పోస్టర్‌ను విడుదల చేసిన మాజీ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్ బద్వేలు పట్టణంలోని యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధా మంగళగిరి లోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి విజయనగరం జిల్లా కేంద్రంలో యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ , రాజాం ఇంచార్జ్ తలే రాజేష్, వైయస్ఆర్‌సీపీ నాయకులు