తాడేపల్లి: ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు, స్వరకర్త, తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ ఆస్దాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీడీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రసాదు కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్బంగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదు గారు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారి సంకీర్తలను స్వరపర్చి వాటిని భక్తికోటికి అందించడంలోనూ ఆయన అమూల్యమైన సేవలు చేశారని అన్నారు.