మిరియాల(కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం గత మూడు రోజులుగా ఉత్సాహంగా జరుగుతోంది. గ్రామంలోని 211, 212 బూత్‌లలో బుధవారం రాత్రి గ్రామ పార్టీ నాయకులు వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే ఇచ్చిన కిట్‌లన్నీ అయిపోయాయని బూత్‌ల కన్వీనర్లు అలవాల లచ్చిరెడ్డి, పి శివశంకరరెడ్డి తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు వజ్రాల రామిరెడ్డి, నాయకులు మేకల కోటిరెడ్డి, ఆరికట్ల లింగారెడ్డి తదితరుల పర్యవేక్షణలో యువ నాయకులు ఎ.రాజశేఖరరెడ్డి, కె.వెంకటేశ్వర్లు, వి.రాజారెడ్డి, ఎ.పూర్ణారెడ్డి, వి.ఆదిరెడ్డి, వి.శ్రీను, బి.నరసింహారెడ్డి, వి.జనార్ధనరెడ్డి, డి.హనుమంతు, పాపారావు, కె.శేషిరెడ్డి, ఆర్.శివారెడ్డి, అరవిందారెడ్డి, వి.ఆదిరెడ్డి తదితరులు ఇంటింటికి తిరిగి జగనన్న ప్రకటించిన నవరత్నాల గురించి వివరిస్తూ ప్రజలను వైయస్సార్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నారు. గ్రామస్తుల నుంచి మంచి స్పందన వస్తోందని వారు తెలిపారు.............................................................<strong>వైయస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2 వేలు</strong>నూజివీడు:వైయస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పింఛన్ దారులందరికీ నెలకు రూ.2 వేలు ఇవ్వడం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు షేక్ అక్బర్ అలి, పల్నాటి శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని 7, 8 వార్డుల్లో గురువారం వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరిగి వైయస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల పథకాలను వివరించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే రైతులకు ఏటా రూ.12,500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. మహిళలకు రుణమాఫీ చేయడంతో పాటు, పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తలారి జోజి, భూక్యా రంగారావు, వేముల శ్రీను, చల్లా రంగారావు తదితరులు పాల్గొన్నారు.